Breaking: భారీగా అక్రమ మద్యం పట్టివేత.. ఎక్కడంటే..?

by Disha Web Desk 3 |
Breaking: భారీగా అక్రమ మద్యం పట్టివేత.. ఎక్కడంటే..?
X

దిశ, ప్రతినిధి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ లోని మోపిదేవి మండలంలోని పెద్దప్రోలు శివారు కప్తానిపాలెం ఎస్సీ కాలనీలో డి వేణు అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. కాగా వేణు అధికారుల కళ్లుగప్పి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు.

అయితే పెదప్రోలు అద్దంకి నాంచారమ్మ గ్రామోత్సవం జాలుగుతోంది. ఈ నేపథ్యంలో జాతరకు మరింత సరుకు అమ్ముడుపోతుందనే ఉద్దేశంతో వేణు అక్రమంగా మద్యం కొనుగోలు చేసి తనవద్ద ఉంచుకున్నారు. అయితే వేణు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తులు మచిలీపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న మచిలీపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేణు ఇంటికి వెళ్లి సోదాలు జరిపారు.

ఈ సోదాల్లో మచిలీపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 60 మద్యం బాటిల్లను గుర్తించారు. అనంతరం ఆ మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేణును అదుపులోకి తీసుకుని అవనిగడ్డ ఎక్సైజ్ సీఐకి అప్పగించారు. కాగా వేణు పై అవనిగడ్డ ఎక్సైజ్ సీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed