AP Medical Colleges: వైద్యవిద్యను ఎలా చెప్పాలి.. లెవెన్మోహన్ రెడ్డి .. మంత్రి సత్యకుమార్ ​ట్విట్టర్​లో సెటైర్​

by Thanuru Gopichand |

మదనపల్లి, ఆదోని, అమలాపురం, బాపట్ల, పెనుకొండ, పాలకొల్లు వైద్య కళాశాలల పురోగతి చూస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి

AP Medical Colleges: వైద్యవిద్యను ఎలా చెప్పాలి.. లెవెన్మోహన్ రెడ్డి .. మంత్రి సత్యకుమార్ ​ట్విట్టర్​లో సెటైర్​
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: మదనపల్లి, ఆదోని, అమలాపురం, బాపట్ల, పెనుకొండ, పాలకొల్లు వైద్య కళాశాలల (Medical Colleges) పురోగతి చూస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. వీటిలో వైద్యవిద్యను ఎలా చెప్పాలో లెవెన్మోహన్ రెడ్డి చెప్పాలి? అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar)​ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్​లో ఓ పోస్టు చేశారు. అందులో నిర్మాణ దశలో ఆగిపోయిన కొన్ని కాలేజీల ఫొటోలను షేర్ చేశారు. మోదీ ప్రభుత్వం ఏపి కి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసి, గ్రాంట్లు, రుణ రూపంలో రూ. 4900 కోట్లు ఇస్తే, చేతకాని సీఎం పులివెందులతో సహా, ఒక్క కాలేజీకి కావలసిన వసతులు పూర్తి చెయ్యలేదని ఆరోపించారు. ఖర్చు పెట్టాల్సిన మొత్తం రూ. 8480 కోట్లలో కేవలం 15శాతం మాత్రమే నాలుగేళ్లలో ఖర్చు చేసి మిగిలిన నిధులను దారి మళ్లించారని అన్నారు. దాని కారణంగా రాష్ట్రం 2500 సీట్లు మూల్యం చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. ఐదు కాలేజీలలో అరకొర మౌలిక వసతులతో, కేవలం పేరు కోసం ఆర్భాటంగా తరగతులు ప్రారంభించారని, చదువు చెప్పడానికి అధ్యాపకులు లేరని పేర్కొన్నారు. సేవలు అందించడానికి నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది లేదు. బాలికలు ఉండడానికి వసతి భవనాలు లేవు. పులివెందుల కళాశాలకు ప్రజాధనం 300 కోట్లు ఖర్చు పెట్టుకున్న జగన్, మదనపల్లిలో 500 కోట్లకు గాను 30 కోట్లు కుడా పెట్టలేదన్నారు. నర్సీపట్నంకు కేవలం 2శాతం నిధులు, పాలకొల్లు కాలేజీకి 0శాతం నిధులు ఖర్చు పెట్టారని అన్నారు. అన్ని కాలేజీల పరిస్థితి ఇదే. గిరిజన ప్రాంతంలో పార్వతీపురం కాలేజీకి చిత్తశుద్ధి లేని గత ప్రభుత్వం టెండర్లనే పిలువలేదు. నిధులు ఖర్చు పెట్టకుండా, భవనాలు నిర్మించకుండా, బోధనసిబ్బందికి నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలేజీలు ఎలా ప్రారంభించాలి? ఎలా నాణ్యమైన వైద్యవిద్యను బోధించాలి? అని ప్రశ్నించారు.

Next Story