- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ కు మరిన్ని కష్టాలు...సెమీస్ ఫైనల్ చేరాలంటే ఎలా ?
సూపర్ 8 లో భాగంగా ఇంగ్లాండ్ చేతిలో ఓడింది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ సెమీస్ చేరడం కష్టతరం కానుంది.

దిశ, వెబ్ డెస్క్: వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చాలా కష్టపడుతూ సూపర్ 8 దాకా వచ్చిన పాకిస్తాన్, తాజాగా ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలు మరింత దూరం అయ్యాయి. సూపర్ 8 లోని గ్రూప్ 2లో పాకిస్తాన్ ప్రస్తుతం మూడవ స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ చేతిలో ఓటమి చెందిన పాకిస్తాన్, మైనస్ రన్ రేట్ లోకి వెళ్లిపోయింది. దీంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరడానికి రెండే రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి.
పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరడం ఎలా ?
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరాలంటే, తన తదుపరి మ్యాచ్ శ్రీలంక పైన గన్ షాట్ గా గెలవాలి. ఈ మ్యాచ్ లో భారీ తేడాతో గెలిస్తే, రన్ రేట్ మెరుగు అయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో న్యూజిలాండ్ ను శ్రీలంక, ఇంగ్లాండ్ ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు పాకిస్తాన్ ఖాతాలోకి మూడు పాయింట్లు దక్కుతాయి. న్యూజిలాండ్ వెనక్కి వెళ్తుంది. దీంతో సెమీ ఫైనల్ కు పాకిస్తాన్ వెళ్లడం ఈజీ అవుతుంది. ఇక రెండోది న్యూజిలాండ్ తన మిగిలిన రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిస్తే, శ్రీలంక పై భారీ తేడాతో పాకిస్తాన్ గెలవాలి.
అప్పుడు న్యూజిలాండ్ కంటే మెరుగైన రన్ రేట్ సాధిస్తుంది పాకిస్తాన్. అలా కూడా సెమీ ఫైనల్ కు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ సెమీ ఫైనల్ కోసం న్యూజిలాండ్ తో పాటు శ్రీలంక కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ రెండు జట్లు కూడా బలమైనవే. శ్రీలంక హోమ్ గ్రౌండ్స్ లో మరింత రెచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. కాగా ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లింది. వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది.






