సంక్రాంతి ఎఫెక్ట్.. రాష్ట్రంలో ఎన్ని వందల కోట్ల మద్యం తాగేశారంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-17 10:08:21  IST  )

సంక్రాంతి పండుగ(Sankranti festival)కు నగరవాసులంతా పల్లెకు వెళ్లి సంతోషంగా పండుగ వేడుకలు జరుపుకున్నారు.

సంక్రాంతి ఎఫెక్ట్.. రాష్ట్రంలో ఎన్ని వందల కోట్ల మద్యం తాగేశారంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ(Sankranti festival)కు నగరవాసులంతా పల్లెకు వెళ్లి సంతోషంగా పండుగ వేడుకలు జరుపుకున్నారు. ఇక పండుగ సందర్భంగా రాష్ట్రంలో మందుబాబులు తగ్గేదే లే అన్నట్లుగా మద్యం(alcohol) తాగేశారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పండుగ 3 రోజుల్లో దాదాపు రూ.400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. భోగి రోజున మద్యం లైసెన్స్‌దారులు రూ.210 కోట్ల మద్యం కొనుగోలు చేయగా.. సంక్రాంతి, కనుమ రోజుల్లో రూ.150కోట్ల చొప్పున అమ్ముడైనట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.80 కోట్ల సేల్ జరుగుతుండగా, ఈ మూడు రోజుల్లో రూ.160కోట్లు అదనంగా అమ్ముడైంది. ఈ నెల 10 నుంచి 15 వరకు 6.99 లక్షల కేసుల లిక్కర్, 2.29L కేసుల బీరు అమ్ముడైంది. ఈ 6 రోజుల్లో మద్యం అమ్మకాలు సగటు కంటే లక్ష కేసుల మద్యం, దాదాపు 30 వేల కేసుల బీర్లు అధికం అని పేర్కొంటున్నారు. అయితే గతంలో సంక్రాంతికి ఎప్పుడూ ఈ రేంజ్‌లో అమ్మకాలు జరగలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.

Next Story