- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరీ ఇంత దారుణమా.. ఆలయంలోనే ఆ పని కానిచ్చేశాడుగా!?(వీడియో)
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు.
అయితే.. తిరుమలలో ఇటీవల అన్యమతస్తుడు నమాజ్ చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగుచూసింది. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం లో అపచారం చోటుచేసుకుంది. టీటీడీ అధికారులు కఠిన చర్యలు చేపట్టిన.. కొందరు ఆకతాయిలు తిరుమల శ్రీవారి సన్నిధిలోనే మద్యం తాగుతూ.. ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. తిరుమల(Tirumala) ఆలయంలో ఓ వ్యక్తి మద్యం సేవించినట్లు ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు తాగి.. ఆ ఖాళీ మందు బాటిళ్లను మెట్ల పైకి విసిరేస్తున్నట్లు.. ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే.. ఇది తిరుమలలోనే జరిగిందా? వీడియోలో ఉన్న నిజమెంతో తెలియదు. కానీ.. ప్రజెంట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన పై టీటీడీ అధికారులు స్పందించాల్సి ఉందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.






