‘వి వి గన్’గా మార్చుకోండి: జగన్ పార్టీపై హోంమంత్రి అనిత సెటైర్స్

by Vemula.Srinu Prasad |

రాజకీయ స్వార్థం కోసం కన్నతల్లిని, చెల్లెలిని కూడా వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ..

‘వి వి గన్’గా మార్చుకోండి: జగన్ పార్టీపై హోంమంత్రి అనిత సెటైర్స్
X

దిశ, వెబ్ డెస్క్: రాజకీయ స్వార్థం కోసం కన్నతల్లిని, చెల్లెలిని కూడా వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) మండిపడ్డారు. తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar Reddy) మరణాన్ని సైతం రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నారని ఆమె ఆరోపించారు. విభజన సమయంలో సోనియా గాంధీ(Sonia Gandi)తో లాలూచీ పడి జగన్ బెయిల్ తెచ్చుకున్నారన్నారని తెలిపారు. తన కోసం పాదయాత్ర చేసిన షర్మిలను సైతం పక్కన పెట్టడం ఆయన నైజానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. తన ఐదేళ్ల పాలనలో విశాఖ(Visakha)లో భూకబ్జాలకు పాల్పడ్డారని , ఆ దెబ్బతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని హోంమంత్రి అనిత విమర్శించారు. వైసీపీ(Ycp)కి "వి వి గన్" (We We Gun) అని పేరు మార్చుకుంటే బాగుంటుందని అనిత సలహా ఇచ్చారు. ప్రజలకు సినిమా చూపిస్తానన్న జగన్‌కు, ఎన్నికల్లో ప్రజలే అసలైన సినిమా చూపించారని ఆమె ఎద్దేవా చేశారు.

Next Story