- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడు శంకుస్థాపనలు.. ఇప్పుడు ధర్నాలా: వైసీపీ నేతలపై హోంమంత్రి ఫైర్
by Vemula.Srinu Prasad |
వైసీపీ నేతలపై హోంమంత్రి అనిత మండిపడ్డారు...

X
దిశ, వెబ్ డెస్క్: అప్పుడు శంకుస్థాపనలు చేసి ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారా అంటూ వైసీపీ(Ycp) నేతలపై హోంమంత్రి అనిత మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేట(Rajaiahpeta)లో బల్క్ డ్రగ్స్ పార్క్(Bulk Drugs Park)కు వ్యతిరేకంగా స్థానికులతో కలిసి వైసీపీ నేతలు ధర్నా చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే బల్క్‌డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన జరిగిందని, అప్పుడు పాలాభిషేకాలు చేసి, ఇప్పుడు ధర్నాలు చేయడాన్ని ప్రజలు ఆలోచించాలని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందన్నారు. మెడికల్ కాలేజీల అంశంపైనా తప్పుడు ప్రచారం జరుగుతోందని హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






