- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల గౌరవాన్ని పెంచావ్.. లేడీ కానిస్టేబుల్‌కు హోంమంత్రి అనిత కీలక హామీ
విధుల్లో లేకపోయినా సమాజం పట్ల తన బాధ్యతను చాటిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: విధుల్లో లేకపోయినా సమాజం పట్ల తన బాధ్యతను చాటిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ కెనాల్ రోడ్డులో శనివారం సాయంత్రం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సమయంలో, సెలవులో ఉన్నప్పటికీ చేతిలో చిన్నబిడ్డతోనే అంబులెన్స్‌కు దారి కల్పిస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేసిన ఆమె నిబద్ధత అందరి మనసులను గెలుచుకుంది. ఈ ఘటనపై స్పందించిన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఇవాళ (మంగళవారం) ఫోన్ ద్వారా అభినందించారు. విధుల్లో లేకపోయినా సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని అంకితభావంతో వ్యవహరించడం ద్వారా పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచారని ఆమె ప్రశంసించారు. జయశాంతి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న హోంమంత్రి, ఆమె చర్య ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని మరింత పెంచిందని అన్నారు.
త్వరలోనే కలుద్దాం..
సోషల్ మీడియా వేదికగా జయశాంతిని అభినందించిన ప్రతి ఒక్కరికీ పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా హోంమంత్రిని ప్రత్యక్షంగా కలిసేందుకు జయశాంతి ఆసక్తి వ్యక్తం చేయగా, త్వరలోనే కలుద్దామని మంత్రి అనిత హామీ ఇచ్చారు. జయశాంతి చూపిన బాధ్యతాయుత సేవా దృక్పథం పోలీస్ శాఖలోనే కాకుండా సమాజమంతటా స్ఫూర్తిగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






