- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూలు బస్సు దుర్ఘటన ప్రాంతాన్ని సందర్శించిన హోం మంత్రి అనిత
కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం టేకూరు గ్రామంలో మనసును కలచివేసే బస్సు అగ్ని ప్రమాదం దుర్ఘటన జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం టేకూరు గ్రామంలో మనసును కలచివేసే బస్సు అగ్ని ప్రమాదం దుర్ఘటన జరిగింది. దేశ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు బస్సు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచే అధికారులతో మాట్లాడారు. బాధితులకు చేయవలసిన సహాయం, మరణించిన వారి పార్థివ దేహాలకు చేయవలసిన పోస్టుమార్టం తదితర అంశాల గురించి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మార్గదర్శనంలో హోం మంత్రి వంగలపూడి అనిత బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. హోం మంత్రితో పాటు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కూడా ప్రమాద స్థలాన్నీ సందర్శించి పరశీలించారు.
డీజీపీ హరీశ్ గుప్తా, డీఐజీ కోయ ప్రవీణ్, కలెక్టర్ డాక్టర్ ఏ.సిర, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఇతర అధికారులు పరిస్థితిని మంత్రులకు వివరించారు. ప్రభుత్వం తరపున అమలు చేస్తున్న, చేయవలసిన చర్యల గురించి వారికి తెలియజేశారు. క్షత్రగాత్రులకు జీజీహెచ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో వారికి అందుతున్న చికిత్సను గురించి మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పోస్టు మార్టం తరువాత మరణించిన వారి కుటుంబాలకు పార్థివ దేహాలను అందించే చర్యల గురించి వాకాబు చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. సహాయక చర్యల్లో ఎటువంటి తప్పదాలు జరగొద్దని స్పష్టం చేశారు.






