- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవళంపేటలో హోంమంత్రి అనిత పర్యటన.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్
by Vemula.Srinu Prasad |
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఘటనపై హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు..

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా దేవళంపేట(Devalampet)లో అంబేద్కర్ విగ్రహానికి(Ambedkar Statue) గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు(Fire) పెట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర హోంమంత్రి అనిత ఈ రోజు దేవళంపేటలో పర్యటించారు. దగ్ధమైన అంబేద్కర్ విగ్రహం స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి ఎవరు నిప్పుపెట్టారో తేలుస్తామన్నారు. దళితుల్ని రెచ్చగొట్టడానికి ఇలా చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కుల, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు సుధాకర్, అనిత విషయంలో వైఎస్ జగన్(Ys Jagan) ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. నేరస్తులు రాజకీయ ముసుగు వేసుకుంటున్నారని హోంమంత్రి అనిత(Home Minister Anitha) ధ్వజమెత్తారు.
Next Story






