నేడు, రేపు అధికారులు మరింత అలెర్ట్‌గా ఉండాలి : హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

by Ramesh Naini |

ఈ రోజు, రేపు మరింత అలెర్ట్‌గా ఉండాలని అధికారులకు ఏపీ హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు.

నేడు, రేపు అధికారులు మరింత అలెర్ట్‌గా ఉండాలి : హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజు, రేపు మరింత అలెర్ట్‌గా ఉండాలని అధికారులకు ఏపీ హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. దిత్వా తుపాను నేపథ్యంలో ఆదివారం సచివాలయంలో ఆర్టీజీఎస్ స్టేట్ సెంటర్ నుంచి హోంమంత్రి అనిత సమీక్ష చేపట్టారు. ఈ మేరకు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటమనేని భాస్కర్, సీఈఓ ప్రఖర్ జైన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాణనష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్ కు వచ్చే కాల్స్‌కు వెంటనే స్పందించాలని తెలిపారు.

ప్రమాద స్పాట్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులను నియమించాలని ఆదేశించారు. జన జీవనానికి అడ్డంకులు కలిగించే విరిగిన కొమ్మలు, హోర్డింగ్స్ వంటివి వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని వెల్లడించారు. విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ చేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా కలెక్టర్లు తెలిపారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశామని కలెక్టర్లు మంత్రికి వివరించారు.

Next Story