‘ఆయన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుంది’.. మంత్రి లోకేష్

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-14 03:55:04  IST  )

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ జయంతి(ఏప్రిల్ 14) పురస్కరించుకుని ఆ మహనీయునికి ఏపీ(Andhra Pradesh) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister nara Lokesh) నివాళులు అర్పించారు.

‘ఆయన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుంది’.. మంత్రి లోకేష్
X

దిశ,వెబ్‌డెస్క్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ 134 వ జయంతి(ఏప్రిల్ 14) పురస్కరించుకుని ఆ మహనీయునికి ఏపీ(Andhra Pradesh) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister nara Lokesh) నివాళులు అర్పించారు. ఈ క్రమంలో భారతీయ సమాజానికి డాక్టర్. BR అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని తెలిపారు.

భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ గారి కృషి అమోఘం. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. అంబేద్కర్(Dr. B.R. Ambedkar) స్ఫూర్తితో ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. డాక్టర్. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story