- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన మరణం పార్టీకి తీరని లోటు.. టీడీపీ నేత మృతి పట్ల మంత్రి నారా లోకేష్
జాకీవుల్లా మరణం పార్టీకి తీరని లోటు అని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ట్వీట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: జాకీవుల్లా మరణం పార్టీకి తీరని లోటు అని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాకు చెందిన నాయకులు జాకీవుల్లా (KM Jakivulla) హఠాన్మరణం పొందారు. దీనిపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. అనంతపురం తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు (TDP Minarity Leader), టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేఎమ్ జాకీవుల్లా మృతి బాధాకరమని అన్నారు.
తెలుగు విద్యార్థి, తెలుగు యువత నాయకుడిగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా ఆయన పార్టీకి అనేక రకాల సేవలందిచారని గుర్తు చేసుకున్నారు. అంతేగాక జాకీవుల్లా కుటుంబం పార్టీ పటిష్టతకు కృషిచేసిందని తెలిపారు. ఇక జాకీవుల్లా మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటు అని, వారి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని మంత్రి లోకేష్ రాసుకొచ్చారు.






