- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాడిపత్రిలో హైటెన్షన్.. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌజ్ అరెస్ట్
అనంతపురం జిల్లా (Anantapur district) తాడిపత్రి (Tadipatri)లో హైటెన్షన్ (high tension) వాతావరణం నెలకొన్నది.

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా (Anantapur district) తాడిపత్రి (Tadipatri)లో హైటెన్షన్ (high tension) వాతావరణం నెలకొన్నది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ (Tadipatri Municipal Chairman) జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు (heavy security) ఏర్పాటు చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Former Tadipatri MLA Kethireddy Pedda Reddy) తాడిపత్రికి వస్తానని ప్రకటించారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అవాంచిత ఘటనలు జరిగే అవకాశం ఉన్నదని, తాడిపత్రికి రావద్దని చెప్పారు.
అంతేగాక యల్లనూరు మండలం (Yellanoor mandal) తిమ్మంపల్లి (Thimmampalli)లోని కేతిరెడ్డి నివాసంలో ఆయనను హౌజ్ అరెస్ట్ (house arrest) చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండని చెప్పి, గృహ నిర్భందం చేస్తూ.. నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలో పోలీసులు భారీగా చేరుకున్నారు. రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేసి, ఎటువంటి గొడవలకు తావు ఇవ్వకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు జేపీ ప్రభాకర్ ఇంటి (JP Prabhakar's house) వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఇక గృహ నిర్భందంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు తాడిపత్రిలో ఉన్న నా ఇంటికి నన్ను వెళ్లనివ్వడం లేదని, తాడిపత్రికి వెళ్లాలంటే వీసా (visa) తీసుకొని వెళ్లాలా అని ప్రశ్నించారు.
వేరే దేశానికి వెళ్లాలంటే వీసా కావాలి, తాడిపత్రికి కూడానా అని, పోలీసులు వీసా ఆఫీస్ ఎక్కడో చెబితే అక్కడికి వెళ్లి అప్లై చేసుకుంటానని మండిపడ్డారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నాడని, ఏమైనా అంటే అభివృద్ధి కోసం అని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. అలాగే తాడిపత్రికి వెళ్తే లాఅండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ (law and order problem) వస్తుందని చెబుతున్నారు. అది ఎలాగో పోలీసులు వివరించాలని అన్నారు. ఎవరో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తాను రెచ్చిపోనని, ఏ రోజైనా తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లి తీరుతానని పెద్దారెడ్డి స్పష్టం చేశారు.






