- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం.. అంబేద్కర్ స్మృతివనం నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది...

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం విజయవాడ(Vijayawada)లో అంబేద్కర్ స్మృతివనం(Ambedkar Memorial Park) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్మృతివనం నిర్వహణను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్మృతివనం ప్రాంగణంలో మురుగు నీరు నిలిచిపోవడం, పలుచోట్ల చెత్తాచెదారం ఉండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కూటమి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. విజయవాడ అంబేద్కర్ స్మృతివనం పట్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశానికి రాజ్యాంగం అందించిన వ్యక్తులను గౌరవించుకోవాలి కదా అని ప్రశ్నించింది. అంబేద్కర్ స్మృతి వనం వద్ద ఏవిధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయో రాతపూర్వకంగా తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.






