డిప్యూటీ సీఎం ఫొటో అంశం.. పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఫొటో పెట్టడాన్ని సవాలు చేస్తూ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court)లో పిటిషన్ దాఖలైంది.

డిప్యూటీ సీఎం ఫొటో అంశం.. పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఫొటో పెట్టడాన్ని సవాలు చేస్తూ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court)లో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన ధర్మాననం సంచలన తీర్పును వెలువరిచింది. డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందో చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదని కోర్టు ప్రశ్నించింది. కేవలం రాజకీయ కారణాలతోనే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని కామెంట్స్ చేస్తూ.. పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేయాలని ధర్మాసనం పిటిషనర్లను మందలించింది.

Next Story