తిరుమలలో భారీగా ఆక్టోపస్ బలగాలు.. హై అలర్ట్ ప్రకటనతో విస్తృత తనిఖీలు(Video)

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-10 07:27:54  IST  )

తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు..

తిరుమలలో భారీగా ఆక్టోపస్ బలగాలు..  హై అలర్ట్ ప్రకటనతో  విస్తృత తనిఖీలు(Video)
X

దిశ, వెబ్ డెస్క్: భారత్(Bharat)-పాకిస్థాన్(Pakistan) ఉద్రిక్త పరిస్థితులు తీవ్రతరమయ్యాయి. రెండు దేశాలు భీకరమైన దాడులకు దిగాయి. పాక్ సైన్యం జరుపుతున్న దాడులను భారత ఆర్మీ(Indian Army) సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. పాక్ ఆర్మీ ప్రయోగించిన డ్రోన్స్(Drones), మిస్సైల్స్‌(Missiles)ను కూల్చివేస్తోంది. అంతేకాదు భారత్ దాడులతో పాక్ ఆర్మీ అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా తిరుమల(Tirumala)లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. టీటీడీ(TTD) హై అలర్ట్ ప్రకటించడంతో తనిఖీలు ఈ రోజు ముమ్మరం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం(Srivari Temple)తో పాటు వివిధ ప్రాంతాలు, వాహనాలు, భక్తులు తిరిగే ప్రాంతాల్లో ఆక్టోపస్ బలగాలు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచించారు. పాకిస్థాన్ చర్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని భక్తులకు వివరించారు.

Click For Tweet..

Next Story