- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో హీరోయిన్ సాయి పల్లవి
నేచురల్ బ్యూటీ, సినీ నటి సాయి పల్లవి(Sai Pallavi) నేడు(మంగళవారం) పుట్టపర్తి(Puttaparthi)లో సందడి చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: నేచురల్ బ్యూటీ, సినీ నటి సాయి పల్లవి (Sai Pallavi) నేడు(మంగళవారం) పుట్టపర్తి(Puttaparthi)లో సందడి చేశారు. ఈ క్రమంలో సాయిపల్లవి శ్రీ సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి దర్శనంలో హీరోయిన్ సాయిపల్లవి పాల్గొన్నారు. ఈ తరుణంలో విద్యార్థులు(Students) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలను తిలకించారు.
హారతి కార్యక్రమం అనంతరం మహా సమాధిని దర్శించుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో సాయిపల్లవి పట్టు చీరలో సంప్రదాయంగా మెరిసి ఆకట్టుకున్నారు. గత ఏడాది కూడా ఇదే సమయంలో బాబాను దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే.. సాయిపల్లవి తమిళనాడు (Tamilnadu)లోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే గ్రామంలో జన్మించారు. సాయి పల్లవి తల్లి రాధా మణి(Radhamani) పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు. అందువల్లే సాయి పల్లవి పేరులో సాయి అని పెట్టినట్లు సమాచారం.
( Post Credit's to Sri Sathya Sai Baba Facebook page)






