నెయ్యి వివాదం.. మాజీ మంత్రి బొత్సకు హెరిటేజ్ నోటీసులు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-18 16:13:05  IST  )

వైసీపీ నేత‌, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు హెరిటేజ్ సంస్థ షాక్ ఇచ్చింది. హెరిటేజ్ నెయ్యిపై నిరాదార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న‌కు నోటీసులు పంపింది. సంస్థ ప్రతిష్ఠతను దెబ్బ తీసే కుట్రకు పాల్పడుతున్నారంటూ పేర్కొంది.

నెయ్యి వివాదం.. మాజీ మంత్రి బొత్సకు హెరిటేజ్ నోటీసులు
X

దిశ‌, వెబ్ డెస్క్: వైసీపీ నేత‌, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు హెరిటేజ్ సంస్థ షాక్ ఇచ్చింది. హెరిటేజ్ నెయ్యిపై నిరాదార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న‌కు నోటీసులు పంపింది. సంస్థ ప్రతిష్ఠతను దెబ్బ తీసే కుట్రకు పాల్పడుతున్నారంటూ పేర్కొంది. తప్పుడు ప్రచారంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు హెరిటేజ్ తరపున న్యాయవాది మల్లికార్జున్ రావు బొత్సకు లీగల్ నోటీసులు పంపారు. ఇదిలా ఉంటే మహరాష్ట్రకు చెందిన ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ సంస్థదేనని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆ సంస్థ ద్వారానే టీటీడీకి నెయ్యి సరఫరా చేశారని అన్నారు.హెరిటేజ్ సంస్థ 22 కంపెనీలతో కలిసి సిండికేట్ గా ఏర్పడిందని చెప్పారు. రూ. 320కి కొనుగోలు చేసే నెయ్యి రూ.700 కు పెంచడం వెనుక కారణం తెలియాలని అన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే బొత్సకు హెరిటేజ్ సంస్థ నోటసులు పంపింది. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story