- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala Update: తిరుమల వెళ్తున్నారా.. ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ తరుణంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా, కొన్ని సార్లు అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ(శనివారం) శ్రీవారిని దర్శించుకునే భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమల(Tirumala)కు వెళ్లేందుకు భక్తులు(Devotees) సొంత వాహనాలలో తరలిరావడంతో తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వారాంతం కావడంతో శనివారం ఉదయం నుంచి అలిపిరి దగ్గర భారీగా వాహనాలు రద్దీ నెలకొంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ ఆలస్యమవుతోంది. అలిపిరి గరుడ కూడలి వరకు వాహనాలు బారులు తీరాయి. మరోవైపు రెండో కనుమ రహదారిలో మరమ్మతులు చేపట్టడంతో ఆ మార్గంలో వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి.






