బిగ్ అలర్ట్... నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

by velandi.Saikiran |

ఏపీ ప్రజలకు అలర్ట్. నేడు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ప‌డ‌నున్నాయి.

బిగ్ అలర్ట్... నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ ప్రజలకు అలర్ట్. నేడు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ప‌డ‌నున్నాయి. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాలలో పిడుగుల‌తో కూడిన‌ భారీ వర్షాలు ప‌డ‌నున్నాయి. అల్లూరి సీతారామరాజు, మార్కాపురం జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావార‌ణ శాఖ అంచ‌నా వేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. వర్షం పడేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని అధికారులు సూచ‌న‌లు చేశారు. అటు నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాలలో 42°C - 43°C ఉష్ణోగ్రతలు ఉంటాయ‌ని కూడా వాతావార‌ణ శాఖ అంచ‌నా వేసింది. ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ సహా పలు కోస్తా జిల్లాల్లో ఎండ సూచనలు చేసింది.

Next Story