బంగాళాఖాతంలో అల్పపీడనం.. అధికారులతో మంత్రుల సమీక్షలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-26 05:29:28  IST  )

పట్టపగలే చిమ్మచీకట్లు కమ్మేలా ఆకాశంలో కారు మేఘాలు కమ్ముకుని ఎడతెరపి లేని వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితి ఇలాగే ఉంటుందని వైజాగ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. అధికారులతో మంత్రుల సమీక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పట్టపగలే చిమ్మచీకట్లు కమ్మేలా ఆకాశంలో కారు మేఘాలు కమ్ముకుని ఎడతెరపి లేని వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితి ఇలాగే ఉంటుందని వైజాగ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. సుమారు 15 నుంచి 20 సెంటీమీర్ల వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత (Home Minister Anitha) ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. భారీ హోర్డింగులను తొలగించాలని తెలిపారు.

మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) శ్రీకాకుళం జిల్లా కలెక్టర స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, సముద్రం అల్పపీడనం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించాలని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే రైతులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Next Story