Heavy Rains: గుంటూరు-హైదరాబాద్ రాకపోకలు బంద్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-13 11:56:22  IST  )

ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీగా వర్షం కురిసింది....

Heavy Rains: గుంటూరు-హైదరాబాద్ రాకపోకలు బంద్
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు చోట్ల ఇళ్లలోకి మోకాల్లోతు భారీగా నీరు చేరింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కొండవీడు వాగు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. దీంతో పెదకూరపాడులో వరద నీరు ఇళ్లలోకి చేరింది. రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లా అనుపాలెంలో వాగు ఉధృతిగా ప్రవహిస్తోంది. రోడ్డుపై వరద నీరు పారుతోంది. ఈ మేరకు వాహనరాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గుంటూరు- హైదరాబాద్ రాకపోకలను బంద్ చేశారు. గుంటూరు-పిడుగురాళ్ల, హైదరాబాద్ వెళ్లే వాహనాలను సత్తెనపల్లి- నరసరావుపేట మీదుగా దారి మళ్లించారు.

Next Story