మరోసారి కేసీఆర్‌ను కలిసిన హరీశ్‌రావు.. నోటీసులపై కీలక చర్చ

by Naga Rani Yarlagadda |

భారత రాష్ట్ర సమితి (BRS) నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్ రావు (Harish Rao) మరోసారి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR)ను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ (Erravalli Farmhouse)లో కలిశారు.

మరోసారి కేసీఆర్‌ను కలిసిన హరీశ్‌రావు.. నోటీసులపై కీలక చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాష్ట్ర సమితి (BRS) నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్ రావు (Harish Rao) మరోసారి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR)ను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ (Erravalli Farmhouse)లో కలిశారు. ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ (Kaleswaram Lift Irrigation Project)కు సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. కేసీఆర్, హరీశ్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌లకు మే 20, 2025న నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో 15 రోజుల్లో కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హరీశ్ రావు, కేసీఆర్‌తో మే 22న భేటీ అయి సుమారు మూడున్నర గంటలపాటు చర్చలు జరిపారు. ఈ నోటీసుల వల్ల వచ్చే రాజకీయ, చట్టపరమైన పరిణామాలపై చర్చించారు.

కమిషన్ ముందు హాజరు కావాలా లేక చట్టపరమైన చర్యలు తీసుకోవాలా అనే అంశాలపై వారు చర్చించినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విచారణ ద్వారా రాజకీయ కక్షసాధింపు చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. దీనికి ఎలా ప్రతిస్పందించాలనే దానిపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

Next Story