హరిదాసు కీర్తనలు.. కళాకారుల వాయిద్యాలు.. చిన్నారుల కోలాటాలు

by Thanuru Gopichand |

కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జోరందుకున్న సంక్రాంతి సంబరాలు.

హరిదాసు కీర్తనలు.. కళాకారుల వాయిద్యాలు.. చిన్నారుల కోలాటాలు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో (Pithapuram) సంక్రాంతి సందడి జోరందుకుంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలను (Pithikapuram Sankranthi Mahotsava Vedukalu) కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఓబిఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణం వేదికగా జరుగుతున్న ఈ వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలతో వేడుకలను ప్రారంభించారు. సంక్రాంతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే హరిదాసు కీర్తనలు, గిరిజన కళాకారుల వాయిద్యాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులు తమ కోలాటాలతో చూసేవారికి ఆకట్టుకుంటున్నారు. హస్త కళాకారులు రూపొందించిన బొమ్మలు, చిత్రాలు కళ్లను కట్టి పడేస్తున్నాయి. చేనేత కళాకారులు రూపొందించిన వివిధ రకాల వస్త్రాలు ఔరా అనిపిస్తున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో హస్తకళలు, చేనేత కళ గొప్పదనాన్ని చాటేలా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఈ వేడుకలకు ముఖ్య ఆహ్వానితులుగా హాజరై సంక్రాంతి వేడుకలను జరుపుకోనున్నారు.

Next Story