- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chandrababu: అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం
రాజధాని అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : రాజధాని అమరావతిలో హ్యాండ్లూమ్ (Handloom) మ్యూజియం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నైపుణ్యం సృజనాత్మకత కలయిక చేనేత లు అని ముఖ్యమంత్రి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవ (National Handloom Day) సందర్భంగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీకి నేతన్నలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. 11 వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు. చేనేత వైభవానికి పుట్టినిల్లు తెలుగునేల... ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే ఓ సంపద చేనేత.. అని సీఎం అన్నారు. పొందూరు ఖద్దరును గాంధీజీ మెచ్చారని గుర్తు చేశారు. నాగరికతకు మూ లం నేతన్న, హరప్పా కాలం నుండి చేనేత అభివృద్ధి చెందిందన్నారు. కాకతీయుల కాలంలో నాణేలపైన చేనేతల ముద్రలు ఉన్నాయని తెలిపారు. బ్రిటిష్ వారు వ్యాపారం కోసం ఇక్కడి నుండి వచ్చి చేనేతల జీవితం పై ప్రభావం చూపారని అభిప్రాయపడ్డారు. అందుకే గాంధీజీ (Gandhi) సైతం విదేశీ వస్త్రాలను బహిష్కరించి కేవలం స్వదేశీ బట్టలను మాత్రమే ఉపయోగించమని చెప్పారని తెలిపారు. చేనేతలకు తెలుగుదేశం తో అవినాభావ సంబంధం ఉందన్నారు. చేనేతలు మొదటగా ఉపాధి కల్పించిన పార్టీ,నాయకుడు నందమూరి తారక రామారావు.. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితం లో చేనేతకు రాజి లేని పోరాటం చేశానని చంద్రబాబు నాయుడు తెలిపారు. వైసీపీ హయాంలో చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైందన్నారు. తాము చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్నాం, ఈ నెల నుంచి మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. నేతన్న భరోసాకు అదనంగా రూ.25వేలకోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళగిరి లో ఇప్పటి వరకు టిడిపి గెలిచింది ఒక్కసారి మాత్రమే అన్నారు. లోకేష్ కు వద్దని వారించినా వినలేదు, వేరే నియోజకవర్గం వెళ్ళాలని సూచించానన్నారు. ఓడిన చోటనే గెలవాలని నిర్ణయించుకొని ముందుకు వచ్చి సాధించారని తెలిపారు.
సామాన్యులకు అందుబాటులోకి తేవాలి..
తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. వీవర్స్ శాలలో మగ్గాలు, చేనేత వస్త్రాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. లోకేష్ సహకారంతో గతంలో వీవర్స్ శాల ఏర్పాటయింది. రాష్ట్రంలో వివిధ చేనేత క్లస్టర్లలో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్‌ను సీఎం పరిశీలించారు. క్లస్టర్లలో ఎంతమంది డిజైనర్లను నియమించారని అధికారులను అడిగిన తెలుసుకున్నారు. 10 క్లస్టర్లలో 10 మంది డిజైనర్లను నియమించామని అధికారులు వివరించారు. ఈ ఉత్పత్తులకు ఏ మేర డిమాండ్ ఉందని సీఎం అడిగారు. చేనేత ఉత్పత్తులపై సెలబ్రిటీలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారని డిజైనర్లు తెలిపారు. ఒక్క సెలబ్రిటీలకే కాకుండా సామాన్యులకు కూడా చేనేత ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు.చేనేత ఉత్పత్తులన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి తనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.






