- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీటీడీ భూమి ఒబెరాయ్ గ్రూప్ కట్టబెట్టడం దారుణం : భూమన
టూరిజం భూమి తీసుకొని టీటీడీ ఆ భూమిని ఒబెరాయ్ గ్రూప్ (Oberai Group) కు కట్టబెట్టడం దారుణం అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణకార రెడ్డి (Bhumana Karunakara Reddy) ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్ : టూరిజం భూమి తీసుకొని టీటీడీ ఆ భూమిని ఒబెరాయ్ గ్రూప్ (Oberai Group) కు కట్టబెట్టడం దారుణం అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణకార రెడ్డి (Bhumana Karunakara Reddy) ఆరోపించారు. కేటాయింపు జరిగిన భూమిని సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. అలిపిరికి అతి సమీపంలో భూములను కేటాయించడం జరిగిందన్నారు. డిసెంబర్ 11న క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని.. అత్యంత వేగంగా 13న జీవో జారీ చేశారన్నారు. టూరిజం స్థలానికి ఎకరం 90 లక్షల రూపాయల విలువ ఉందన్నారు. గజం రూ.49 వేలు, ఎకరాకు 26కోట్ల రూపాయలు విలువ చేసే 20 ఎకరాలు రూ.460 కోట్ల విలువైన భూములను ఒబెరాయ్ గ్రూప్ కు టీటీడీ దోచిపెట్టిందన విమర్శించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.3వేల కోట్లకు పైగానే ఉంటుందన్నారు. కోహినూరు వజ్రం కంటే టీటీడీ స్థలానిక విలువ ఎక్కువన్నారు. దానిన వెల కట్టలేమని భూమన స్పష్టం చేశారు. టూరిజం శాఖ నుంచి టీటీడీ కేవలం రేూ.18 కోట్లకే స్థలాన్ని తీసుకుందని పేర్కొన్నారు.
ఒబెరాయ్ హోటల్ లీజు డీన్ మనీని ఎందుకు మాఫీ చేశారని ప్రశ్నించారు. దాని వల్ల భగవంతుడికి ఇచ్చిన ఇనామ్ భూమి ప్రైవేట్ వ్యక్తులపరమైందని తెలిపారు. శంకరయ్య సులేమాన్ అయినట్లు, ఒబెరాయ్ ముంతాజ్ హోటల్ స్వర గా మారిందన ెద్దేవా చేశారు. మూడు వేల కోట్ల విలువైన భూమిని ఒబేరాయ్ గ్రూప్ కు తక్కువ ధరకే కట్టబెట్టారని ఆరోపించారు. 13న జీఓ జారీ చేస్తే ఇప్పటి వరకు అది ఆన్లైన్ కాకపోవడంపై అనుమానాలను వ్యక్తం చేశారు. భూమిని డిసెంబర్ 5న రిజిష్ట్రేషన్ చేశారని.. అది కూడా ఆన్లైన్ లో చూపించడం లేదన్నారు. ఒబేరాయ్ గ్రూప్ కు కేటాయించిన భూమిలో ఎర్ర చందనం చెట్లు ఉన్న విషయాన్ని తాను స్వయంగా పరిశీలించానని వెల్లడించారు.
100 రూమ్స్ తో ఒబెరాయ్ హోటల్ నిర్మిస్తే 1500ల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రజలకు చెప్తోందన్నారు. అది ఎలా సాధ్యమో తనకు తెలియడం లేదన్నారు. కేవలం హోటల్ పేరు మార్చి అనుమతులు మంజూరు చేయడాన్ని తప్పుబట్టారు. పరకామణి దోపిడీ కంటే అతిపెద్ద దోపిడీగా అభివర్ణించారు. ప్రైవేట్ హోటల్స్ కు టీటీడీ స్థలం దారాదత్తం చేయడం దారుణమని తెలిపారు. దాని వల్ల టీటీడీకి రూపాయి లాభం లేదని విమర్శల వర్షం కురిపించారు. ఎవరికి మేలు చేయడానికి రూ.2 కోట్ల బిల్డింగ్ ఫీజు సర్దుబాటు చేశారని, 26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేశారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనాడు తీసుకు వచ్చిన ఏడు కొండలు పరిధిలోనే ఈ భూములు ఉన్నాయని గుర్తు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామికే మూడు నామాలు పెడతారా అని నిలదీశారు. జిల్లాకలెక్టర్ కూడా నైతిక బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
అలిపిరి వద్ద అనుమతులు లేకుండా పనులు ఎలా జరుగుతున్నాయని.. ఎర్ర చందనం దుంగలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలన్నారు. రెవెన్యూ ల్యాండ్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉన్న భూమిని ఇవ్వడం వెనుక మతలబు ఏమిటని అడిగారు. స్వామీజీలు దీనిపై మౌనం వీడి పోరాటం చేయాలని కోరారు.






