అర లీటర్ పెట్రోల్ రూ.400...పెట్రోల్ బంక్ ఘరానా మోసం.. వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

ఈ మధ్య పెట్రోల్ బంకుల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని ఓ పెట్రోల్ బంక్‌లో లీటర్ పెట్రోల్ కొట్టిస్తే అరలీటరే వచ్చిన సంగతి తెలిసిందే.

అర లీటర్ పెట్రోల్ రూ.400...పెట్రోల్ బంక్ ఘరానా మోసం.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య పెట్రోల్ బంకుల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని ఓ పెట్రోల్ బంక్‌లో లీటర్ పెట్రోల్ కొట్టిస్తే అరలీటరే వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా అలాంటి ఘటనే నెల్లూరులోని బుచ్చిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. వాహనదారుడు రూ.400 పెట్రోల్ కొట్టించగా కేవలం అరలీటర్ మాత్రమే వచ్చింది. వాహనదారుడు పెట్రోల్ కొట్టించుకున్న తరవాత అనుమానం రాగా వెంటనే బండిలోని పెట్రోల్ తీసి బకెట్‌లో పోయించాడు.

దీంతో దాదాపు 4 లీటర్ల వరకు రావాల్సిన పెట్రోల్ కేవలం అరలీటర్ రావడంతో షాక్ అయ్యాడు. వెంటనే సిబ్బందిని నిలదీయగా పొంతనలేని సమాధానం ఇచ్చారు. తాను వేరే వ్యక్తితో మాట్లాడుతూ పెట్రోల్ కొట్టానని అందుకే తక్కువ వచ్చిందని సిబ్బంది సమాధానం ఇచ్చారు. మరి బిల్ రూ.400 ఎలా అయ్యిందని వాహనదారుడు నిలదీస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story