ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ... తీర్పుపై స్టేకు నిరాకరణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-25 13:05:45  IST  )

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది....

ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ... తీర్పుపై స్టేకు నిరాకరణ
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు(YSRCP MLC Ananthababu)కు హైకోర్టు(High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు(Dalit driver Subrahmanyam Case)లో తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు(Rajahmundry SC and ST Special Court) తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పు ఎమ్మెల్సీ అనంతబాబు హైకోర్టులో సవాల్ చేశారు. ఆ తీర్పును రద్దు చేయాలని కోరారు. అంతేకాకుండా అత్యవసరంగా విచారణ చేపట్టాలని అనంతబాబు తరపు న్యాయవాది అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

Next Story