- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏరకంగా తప్పు జరిగిందో చంద్రబాబు చెప్పాలి: సజ్జల సంచలన డిమాండ్
శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేశారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు..

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ నెయ్యి ఘటన(Tirumala Laddu Ghee)లో ఏ రకంగా తప్పు జరిగిందో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) చెప్పాలని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(YSRCP Senior leader Sajjala Ramakrishna Reddy) డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డూలో జంతువుల అవశేషాలు కలవలేదని కోర్టుకు సిట్ నివేదిక సమర్పించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. తమపై చంద్రబాబు దుష్ప్రచారం చేశారని, అందుకే ఆధారాలు చూపించకలేకపోయారని విమర్శించారు. 2014-19 చంద్రబాబు హయాంలో ఉన్న హర్ష్ డెయిరీ ఆ తర్వాత భోలే బాబా డెయిరీగా మారిందని సజ్జల తెలిపారు.
వైవీ కోర్టుకు వెళ్లారు..
శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన ఆరోపణలపై అప్పటి టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించారని సజ్జల చెప్పారు. రెండు జాతీయ ల్యాబ్ రిపోర్టులో చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధమని తేల్చాయిన సజ్జల ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత జగన్ తో పాటు పార్టీ నాయకులను నిందించడంపైనే తాము ప్రశ్నించామన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసి చంద్రబాబు పాపం చేశారని ఆరోపించారు. టీడీపీ అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకే తమ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు. తప్పు చేసి ఒప్పుకునే విచక్షణ చంద్రబాబు లేదని విమర్శించారు. సిట్ నివేదిక కోర్టుకు ఇచ్చిన తర్వాత కూడా టీడీపీ నేతలు కల్తీ జరిగిందనే విష ప్రచారాన్ని మళ్లీ కొనసాగిస్తున్నారని సజ్జల మండిపడ్డారు.






