వైసీపీకి అనుకూలంగా వర్క్.. వెంకట్రామిరెడ్డి ఉద్యోగం డిస్మిస్

by Vemula.Srinu Prasad |

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది...

వైసీపీకి అనుకూలంగా వర్క్.. వెంకట్రామిరెడ్డి ఉద్యోగం డిస్మిస్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి(Andhra Pradesh Secretariat Employees Association Former President K. Venkatrami Reddy)ని ప్రభుత్వం ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి, వైసీపీ(Ycp)కి అనుకూలంగా ప్రచారం చేశారనే ఆరోపణలపై ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

ఉద్యోగంతో పాటు బెనిఫిట్స్ కూడా..

ఉద్యోగం నుండి తొలగించడమే కాకుండా, ఆయనకు లభించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లను కూడా నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కొంతకాలంగా సాగిన విచారణ అనంతరం ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుందని నిర్ధారిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వెంకట్రామిరెడ్డి అటు ఉద్యోగాన్ని, ఇటు పెన్షన్ సంబంధిత ప్రయోజనాలను కూడా కోల్పోయారు.

Next Story