- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలింగ్ బూత్ల మార్పుపై హైకోర్టులో సవాల్.. కాసేపట్లో తీర్పు
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల సంఘం సర్వంసిద్ధం చేసింది..

దిశ, వెబ్ డెస్క్: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల(Pulivendula ZPTC elections)కు ఎన్నికల సంఘం సర్వంసిద్ధం చేసింది. అయితే కొన్నిఫిర్యాదుల నేపథ్యంలో పలుచోట్ల పోలింగ్ బూతులను మార్పు చేసింది. అయితే ఈ మార్పును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcongress Party) తప్పుబట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అప్పిరెడ్డి హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. ఎన్నికల పోలింగ్ బూతులను మార్పు చేయడంపై లంచ్ మోహన్ పిటిషన్ను దాఖలు చేశారు. 6 పోలింగ్ బూతులను మార్చడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే ఆ పోలింగ్ బూతులను యథావిథిగా అక్కడే కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కాసేపట్లో తుది ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. దీంతో తీర్పు ఎలా ఉంటుందోనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు.
మరోవైపు ఎన్నికల సంఘాన్ని వైసీపీ నేతలు కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫిర్యాదు చేశారు.






