- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరులో ఉద్రిక్తత.. టీడీపీ, జనసేన, సీపీఐ నేతల అరెస్ట్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ గుంటూరులో జనసేన, సీపీఐ నేతలు సత్యాగ్రహ ర్యాలీ నిర్వహించారు.

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ, జనసేన, సీపీఐ నేతలు సత్యాగ్రహ ర్యాలీ నిర్వహించారు. అయితే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, నేతలకు వాగ్వాదం జరిగింది. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులతో సహా టీడీపీ, జనసేన, సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై మూడు పార్టీల నాయకులు మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే తమను అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబును జైలు నుంచి విడుదల చేసే వరకూ తమ పోరాటం ఆగదని టీడీపీ నేతలు హెచ్చరించారు.
Next Story






