- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సుమోటో కేసు నమోదు చేయాలి
ప్రజా ఉద్యమంలో అమరులైన వారి వారి కుటుంబ సభ్యులకు అందజేయకపోవడం ప్రజాస్వామిక విరుద్ధమని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశ పౌరులను హత్య చేయడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుమోటోగా స్వీకరించి నారాయణపూర్ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో జరిగినట్లుగా చెబుతున్న ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరపాలని ప్రజా సంఘాల డిమాండ్ చేశాయి.

- అమరుల బంధుమిత్రుల సంఘం డిమాండ్
- సజ్జా కుటుంబాన్ని పరామర్శించిన ప్రజా సంఘాలు
- మృతదేహాలను భద్రపరచాలనీ డిమాండ్
దిశ ప్రతినిధి, బాపట్ల: ప్రజా ఉద్యమంలో అమరులైన వారి వారి కుటుంబ సభ్యులకు అందజేయకపోవడం ప్రజాస్వామిక విరుద్ధమని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశ పౌరులను హత్య చేయడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుమోటోగా స్వీకరించి నారాయణపూర్ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో జరిగినట్లుగా చెబుతున్న ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరపాలని ప్రజా సంఘాల డిమాండ్ చేశాయి. అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం చీరాల మండలం జాండ్రపేట గ్రామంలో నాగేశ్వరరావు సోదరుని ఇంటికి వెళ్లిన ప్రజా సంఘాల ప్రతినిధులు అమరుడు నాగేశ్వరరావు సోదరుడు సజ్జా శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం అమరుల బంధుమిత్రుల సంఘం నాయకులు అంజమ్మ మీడియాతో మాట్లాడుతూ, మే 20వ తేదీ మరణించిన అమరుల మృతదేహాలను భద్రపరచకుండా కాలయాపన చేస్తూ శరీరం కుళ్ళిపోయే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మరణించిన ఉద్యమకారుల పైన కూడా హింసను ప్రయోగిస్తుందని, అమరుల కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తుందని ఆమె పేర్కొన్నారు. మతం పేరుతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మృతుల కుటుంబాలు నిర్వహించే అంతిమ సంస్కార సంప్రదాయాలను జరుపుకోవడానికి మృతదేహాలను అప్పగించకపోవడం హిందూ సాంప్రదాయానికి విరుద్ధమనీ ఆమె తెలిపారు.
విప్లవ రచయితల సంఘం నేత అరసవల్లి కృష్ణ మాట్లాడుతూ, మధ్య భారత దేశంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలని, ఆదివాసీలపై కొనసాగుతున్న సైనిక చర్యల ద్వారా మానవహననం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ ప్రతినిధులు పలుమార్లు శాంతి చర్చలకు సిద్ధమని అందులో భాగంగా కాల్పుల విరమణ ప్రకటించినప్పటికి ఏకపక్షంగా సైనిక చర్యలకు పాల్పడుతూ దేశంలో భయానిక పరిస్థితులను కేంద్రం సృష్టిస్తోందన్నారు.
రాష్ట్ర చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు డాక్టర్ మాచర్ల మోహన్ రావు మాట్లాడుతూ.. 1/70, పీసా చట్టం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజన హక్కులు కాపాడుకోవడం కోసం జరుగుతున్న ఆదివాసి ఉద్యమాలను అణిచివేయడం ద్వారా విదేశీ బహుళ జాతి సంస్థలకు లక్షల కోట్ల విలువైన అటవీ ఖనిజ సంపదలను దారాదత్తం చేయడానికి కేంద్రం చేస్తున్న కుటిల ప్రయత్నమే ఆపరేషన్ కగార్ అనీ, ఆపరేషన్ కగార్ ను దేశ ప్రజలు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం కేంద్ర ప్రభుత్వానీకున్న తన విశేష అధికారాన్ని ఉపయోగించి అంతర్గత అశాంతిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్చలను కొనసాగించకపోగా, పలుమార్లు చర్చలకు మావోయిస్టులు ప్రతిపాదనలు చేసినప్పటికీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ అంతమొందించడమే ధ్యేయంగా, దేశ సంపదలను కొల్లగొట్టి, విదేశీ సంస్థలకు అప్పగిస్తూ దేశ పౌరులను కిరాతకంగా హత్య చేస్తూ దేశభక్తిగా ప్రకటించుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.
ఇప్పటివరకు సమాచారం లేదు: సజ్జా సోదరుడు
నారాయణపూర్ జిల్లా మాడ్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పులలో మృతి చెందిన మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, మిలటరీ పత్రిక ఇంచార్జ్ సజ్జా వెంకట నాగేశ్వరరావు, మధు, నవీన్, ఏసన్న, రాజన్న సోదరుడు సజ్జా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈరోజు వరకు ప్రభుత్వం నుండి మా సోదరుడు మరణించిన విషయంగానీ, మృతదేహాన్ని తీసుకు వెళ్ళవలసిందిగా సమాచారంగానీ ఇచ్చి ఉండలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వంతో ఆలోచించి వెంకట నాగేశ్వరరావు మృతదేహాన్ని తమ కుటుంబానికి అందజేయాలని స్థానిక రెవెన్యూ పోలీసు అధకారులను కోరినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సహకరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోప్రగతి శీల కార్మిక సమాఖ్య కొండారెడ్డి, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు వై.వెంకటేశ్వరరావు, బహుజన సమాజ్ పార్టీ నేత పి.పుల్లయ్య, రాష్ట్ర చేనేత జన సమాఖ్య నాయకులు దేవన వీర నాగేశ్వరరావు, బిసి ఫెడరేషన్ నాయకులు ఊటుకూరు వెంకటేశ్వర్లు, జ్యోతిర్మయి దేవాంగ సమితి బీరక పరమేష్ తదితరులు పాల్గొన్నారు.






