హెచ్‌వోడీలపై మంత్రి డీబీవీ ఫైర్.. మళ్లీ జరిగితే సహించమని హెచ్చరిక

by Vemula.Srinu Prasad |

హెచ్‌వోడీలపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఫైర్ అయ్యారు. నోడల్ సమావేశానికి రాకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

హెచ్‌వోడీలపై మంత్రి డీబీవీ ఫైర్.. మళ్లీ జరిగితే సహించమని హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: హెచ్‌వోడీలపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి(Minister Dola Bala Veeranjaneyaswamy) ఫైర్ అయ్యారు. నోడల్ సమావేశానికి(Nodal meeting) రాకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ అంటే అధికారులకు అంత చిన్న చూపా? అంటూ మండిపడ్డారు. సచివాలయంలో నిర్వహించిన ఎస్సీ సబ్ ప్లాబ్ నిధుల వినియోగంపై నోడల్ ఏజెన్సీ సమావేశానికి పలువురు హెచ్వోడీలు గైర్హాజరుకావడంతో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సీరియస్ అయ్యారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.

ప్రజలపై నిర్లక్ష్యాన్ని సహించం

హెచ్‌వోడీలు సమావేశానికి రాకపోవడం పేద, బలహీన వర్గాల ప్రజల పట్ల వారికున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నని మంత్రి చెప్పారు. హెచ్‌వోడీలు తప్పనిసరిగా నోడల్ ఏజెన్సీ సమావేశానికి హాజరు కావాలన్నారు. ఈ ఏడాది ముగుస్తున్నా సబ్ ప్లాన్ నిధుల వినియోగంలో కొన్ని డిపార్ట్మెంట్లు ఎందుకు వెనుకబడి ఉన్నాయని ప్రశ్నించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 100 శాతం ఖర్చు చేయాలని సూచించారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగానికి అంచనాలు రూపొందించేటప్పుడు ఊహాగానాలతో లెక్కలు వేయకుండా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నిర్దిష్టమైన ప్రణాళికలతో అంచనాలు రూపొందించాలన్నారు. ఎస్సీ కాలనీల్లో సిసి రోడ్లు, త్రాగునీటి సౌకర్యాలపై మరింత దృష్టి సారించాలని అధికారులకు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సూచించారు.

Next Story