నేను చచ్చేది అక్కడే.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-08 16:44:20  IST  )

ఏపీ మంత్రి అంబటి రాంబాబు తన చావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ...

నేను చచ్చేది అక్కడే.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి అంబటి రాంబాబు తన చావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్యేగా ఉన్న సత్తెనపల్లిలోనే తాను చచ్చేదని ఆయన తెలిపారు. నిజానికి అంబటి రాంబాబుది రేపల్లె. కానీ ఆయన 2019లో సత్తెనపల్లి నియోకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రాంబాబును ప్రతిపక్ష పార్టీలు నాన్ లోకల్ అని విమర్శలు చేస్తున్నాయి. రాంబాబు సొంత నియోజకవర్గం రేపల్లె అని.. ఆయన ఎప్పటికైనా అక్కడికి వెళ్లిపోతారని ఎద్దేవా చేస్తున్నారు. దీంతో అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. తాను పుట్టింది రేపల్లెలో అయినా.. చచ్చేది మాత్రం సత్తెనపల్లిలోనే ఆయన వ్యాఖ్యానించారు. తనది సత్తెనపల్లి కాకపోయినా అక్కడి ప్రజలు ఎంతోగానో ఆదరించారని పేర్కొన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు గురించి మాటాడుతూ గత ప్రభుత్వ తప్పిదాల వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని వ్యాఖ్యానించారు. అమ్ముడు పోయే పార్టీ జనసేన అని రాంబాబు ఎద్దేవా చేశారు.

Next Story