Arundelpeta: భార్యకు వేధింపులు.. డీఐజీ కిరణ్‌పై కేసు నమోదు

by Vemula.Srinu Prasad |

నెల్లూరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్‌పై గుంటూరు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు..

Arundelpeta: భార్యకు వేధింపులు.. డీఐజీ కిరణ్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: భార్యకు వేధింపుల కేసు(Wife harassment case)లో నెల్లూరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్‌(Nellore Stamps and Registration DIG Kiran)పై గుంటూరు అరండల్‌పేట పోలీసులు(Guntur Arundalpet Police) కేసు నమోదు చేశారు. ఎల్ఐసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న భార్యకు, ఆమె భర్త డీఐజీ కిరణ్ కు కొంతకాలంగా గొడవలు జరుగున్నారు. ఈ క్రమంలో గత రాత్రి భార్యను తీవ్రం కొట్టారు. తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్చించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భర్త వేధింపులపై అరండల్ పేట పోలీసులకు భార్య ఫిర్యాదు చేశారు. దీంతో తనను డీఐజీ కిరణ్ మరింత వేధింపులకు గురి చేస్తున్నాడని భార్య ఆరోపిస్తున్నారు. తమ బంధువులపై అట్రాసిటీ కేసు పెడతామని భర్త కిరణ్ బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. అంతేకాదు తన ఫోన్‌కు అశ్లీల ఫొటోలు పంపి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు డీఐజీ కిరణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story