MAVIGUNనే ఏపీ అభివృద్ధి మంత్రం: మాజీ మంత్రి అంబటి రాంబాబు

by Vemula.Srinu Prasad |

ఏపీ అభివృద్ధిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసే శక్తి ఈ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. ..

MAVIGUNనే ఏపీ అభివృద్ధి మంత్రం: మాజీ మంత్రి అంబటి రాంబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap) అభివృద్ధిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి(Amaravati) పేరుతో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసే శక్తి ఈ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. కేవలం గ్రాఫిక్స్‌తోనూ, అప్పులతోనూ రాజధానిని నిర్మిస్తామని చెప్పడం ప్రజలను వంచించడమేనని మండిపడ్డారు. అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు కాదని, దానిపై పెడుతున్న భారీ వ్యయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా మారుతుందని అంబటి ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి..

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణే సరైన మార్గమని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మచిలీపట్నం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు (MAVIGUN) వంటి నగరాలను పారిశ్రామికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారానే ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ఒకే ప్రాంతంలో లక్షల కోట్లు కుమ్మరించడం కంటే అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి ఫలాలను పంచడమే తమ విధానమని, అదే అసలైన అభివృద్ధి మంత్రమని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

అంబటి ట్వీట్..

Next Story