- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్షల మంది దత్తత శుభపరిణామం: 'పీ4' సక్సెస్‌పై సీఎం హర్షం
రాష్ట్ర అభివృద్ధిలో పీ4 నమూనాను ఒక పవర్‌ఫుల్ 'గేమ్‌ఛేంజర్' అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సమాజంలోని పేదరికాన్ని శాశ్వతంగా తరిమికొట్టేందుకే ఈ వినూత్న పథకాన్ని రూపొందించామని ఆయన స్పష్టం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అభివృద్ధిలో పీ4 (Public Private People Partnership) నమూనాను ఒక పవర్‌ఫుల్ 'గేమ్‌ఛేంజర్' అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సమాజంలోని పేదరికాన్ని శాశ్వతంగా తరిమికొట్టేందుకే ఈ వినూత్న పథకాన్ని రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా లక్ష మంది మార్గదర్శులు, సుమారు పది లక్షల మందిని దత్తత తీసుకోవడం శుభపరిణామమని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వ సాయం మాత్రమే కాకుండా, సంపన్న వర్గాల, వ్యక్తుల భాగస్వామ్యంతో పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశమని సీఎం చంద్రబాబు వివరించారు.
మహిళా సాధికారత, లింగ సమానత్వానికి కట్టుబడి ఉన్నాం
మహిళా సాధికారత, లింగ సమానత్వం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2023లో అన్ని పార్టీలు మద్దతు తెలిపిన మహిళా రిజర్వేషన్ బిల్లును, ఇప్పుడు సీట్లు పెంచుతున్న తరుణంలో విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు ప్రవహించినప్పుడే సంపద సృష్టి జరుగుతుందని, తద్వారా పేదరికం తొలగిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని..
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జనాభా పెరుగుదతలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు దశాబ్దాల క్రితం జనాభా నియంత్రణపై తాను చేసిన పోరాటం ఫలితాన్ని ఇచ్చిందని, అయితే ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. యువత శాతం తగ్గిపోతే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించిన చంద్రబాబు, సంతానోత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందంటూ పౌరులకు విజ్ఞప్తి చేశారు. సంస్కరణలు మరియు సామాజిక బాధ్యత మేళవిస్తేనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.






