సీఎం చంద్రబాబు సర్వే.. వెనకబడ్డ మరో 37 మంది ఎమ్మెల్యేలు

by Vemula.Srinu Prasad |

పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు..

సీఎం చంద్రబాబు సర్వే.. వెనకబడ్డ మరో 37 మంది ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్ డెస్క్: పార్టీ నేతల పని తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేల పని తీరు మార్చుకోవాలని చెప్పారు. తాజాగా మరో 37 మంది ఎమ్మెల్యేల పని తీరు మరింత మెరుగుపర్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అందుబాటులో ఉన్న నేతలతో అమరావతి ఎన్టీఆర్ భవన్‌(Amaravati Ntr Bhavan)లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ప్రతి ఎమ్మెల్యే పని తీరుపై కచ్చితమైన సర్వేలు తెప్పించుకుంటున్నానని తెలిపారు. పదవుల కోసం కాకుండా నిస్వార్ధంగా పని చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story