జులై నాటికి రాష్ట్రమంతా ‘సంజీవని’: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

by Ramesh Naini |

మెరుగైన ప్రజారోగ్యం కోసం జులై నాటికి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని ప్రాజెక్టు’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

జులై నాటికి రాష్ట్రమంతా ‘సంజీవని’:  అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెరుగైన ప్రజారోగ్యం కోసం జులై నాటికి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని ప్రాజెక్టు’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా, కుప్పం, నారావారి పల్లెలో విజయవంతంగా అమలవుతున్న ఈ ప్రాజెక్టును రాష్ట్రమంతటా విస్తరించి, వచ్చే ఏడాదిలోగా 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఏప్రిల్ నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లోకి వెళ్లాలని.. ప్రతి నెలా నాలుగో శనివారం తప్పనిసరిగా హెల్త్ క్యాంపులు, గ్రామసభలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. వైద్య పరీక్షల ఫలితాలను వాట్సప్ ద్వారా నేరుగా 48 గంటల్లో వారికి అందించాలని తెలిపారు. అయితే ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూన్సిట్ అవసరం కానున్నాయని, 162 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు వివరించగా ముఖ్యమంత్రి ఓకే చెప్పారు.

Next Story