- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగురాళ్లలో చికెన్ కొట్టు వివాదం
చికెన్ కొట్టులో ఒక వ్యక్తిని చితగొట్టేసిన సంఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : చికెన్ కొట్టులో ఒక వ్యక్తిని చితగొట్టేసిన సంఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఒకసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనతో స్థానికులతో ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల జిల్లాలో పెరిగిపోతున్న నేరాలు దారుణమైన పరిస్థితులకు అద్దం పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలే హత్యలు, వ్యాపారులపై దాడులతో జనం బెంబెలెత్తే పరిస్థితులు శాంతి భద్రతల పరిరక్షణకు సవాలు విసురుతున్నారు. ఇక పోలీసుల సమాచారం ప్రకారం.. మాచవరం మండల పరిధిలోని తురకపాలెంకు చెందిన ఓ వ్యక్తిపై పిడుగురాళ్లలో చికెన్ కొట్టు నిర్వహిస్తున్నాడు. ఈ విషయమై స్థానికంగా కొందరితో వివాదం నెలకొన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఎప్పటిలాగే వ్యాపారం వద్దకు వచ్చి పని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో కొందరు దుండగులు అతని వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో దుండగులు అతనిపై దాడి చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దాడిలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే చికెన్ మార్కెట్ పై పట్టుకోసమే ఇటువంటి దాడులు జరుగుతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోజురోజు పెచ్చుమీరుతున్న పైరవీలు దాడుల వరకు వెళ్తున్నట్లు ఆరోపణలు వెళ్లువెత్తున్నాయి. మార్కెట్ పై పట్టుకోసం పైరవీలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో పలు విమర్శలు వస్తున్నాయి. చికెన్ షాపుల అనుమతులు, వ్యాపార విస్తరణ, రేట్ల నియంత్రణ వంటి అంశాలలో ఈ పైరవీల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని పలువురు అంటున్నారు. అయితే చికెన్ మార్కెట్‌కు సంబంధించి చెలరేగుతున్నట్లు అనుమానిస్తున్న ఈ వివాదాలు, దాడుల నేపథ్యంలో, శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తక్షణమే ఈ విషయంపై దృష్టి సారించి, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మార్కెట్‌లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ప్రజలు కోరుతున్నారు.






