- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం జరిగింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనెపూడి(Donepudi)లో జరిగింది. రోడ్డుపై అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితులను స్థానిక ఎమ్మె్ల్యే నక్కా ఆనందబాబు పరామర్శించారు.
కాగా శుక్రవారం ఉదయం అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా మరో 22 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మర్చిపోకముందే మరో ప్రమాదం జరగడంతో భయాందోళనలు, ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. వేగాన్ని కంట్రోల్ చేసుకుంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






