- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: అంబటికి రిమాండ్
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది...

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu)కు సోమవారం బిగ్ షాక్ తగిలింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆయన గుంటూరు కోర్టు(Guntur Court) రిమాండ్ విధించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababi Naidu)ను కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను రాజమండ్రి జైలు నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చారు. ఈ మేరకు వాదనలు జరిగింది. దీంతో రాంబాబుకు ధర్మాసనం ఈ నెల 22వరకు రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ను జైలుకు పోలీసులు తరలించారు.
కేసు ఇదే..
కాగా మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ నెలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా తలెత్తిన పరిస్థితుల్లో పోలీసుల విధులకు ఆయన ఆటంకం కలిగించారని ఆ రోజు కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది.






