- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రూప్-2 మెయిన్స్ .. అలా మొదలైంది..
ఏపీలో ఈ రోజు ఉదయం గ్రూప్-2 మెయిన్స్ మొదలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఈ రోజు ఉదయం గ్రూప్-2 మెయిన్స్ మొదలైంది. మొత్తం 175 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. 92,250 మంది పరీక్షకు హాజరు కావలసి ఉంది. ఈ ఉదయం 10 గంటలకు పేపర్1 ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3 గంటలకు పేపర్2 జరగనుంది. ఈ పరీక్షపై నిన్నంతా ఉత్కంఠ నెలకొంది. రోస్టర్పాయింట్ల నిర్ధారణ చేయకుండా పరీక్ష నిర్వహించడాన్ని అభ్యర్థులు వ్యతిరేకించారు. దీంతో ఆందోళనకు దిగారు. ఈ పరీక్షను వాయిదా వేయాలని కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. వీరి పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. పరీక్ష వాయిదా వేయాలంటూ నిన్న ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. దీనిని ఏపీపీఎస్సీ తిరస్కరించింది. దీంతో పరీక్ష వాయిదా పడడం లేదంటూ నిన్న సాయంత్రం ప్రకటించింది. దీంతో విద్యార్థులు పరీక్షకు సిద్ధం అయ్యారు. చివరివరకు వాయిదా పడుతుందన్న ఆశతో ఉన్న కొంతమంది దూరప్రాంతాల్లో ఉన్న పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు.
విశాఖపట్నం జిల్లాలో 16 కేంద్రాల్లో ప్రశాంతంగా గ్రూప్ 2 ప్రధాన పరీక్ష మొదలైంది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తనిఖీ చేశారు.కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని తెలుసుకుంటూ కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు నివేదిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ అన్నికేంద్రాల్లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు.అన్ని పరీక్షా కేంద్రాల్లో నిర్ణీత సమయానికే పరీక్ష ప్రశాంతంగా మొదలైంది. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసులకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.






