బస్సు ప్రమాద బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలి: నారా లోకేశ్

by Seetharam |
బస్సు ప్రమాద బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలి: నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడం బాధాకరమన్నారు. ప్లాట్ ఫాం పైకి బస్సు దూసుకురావడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందన్నారు. ఈ ప్రమాదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది అని చెప్పుకొచ్చారు. కాలంచెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి అని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదన్నారు. నాలుగున్నరేళ్లుగా ఆర్టీసి గ్యారేజిల్లో నట్లు, బోల్టుల కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులివ్వడంలేదని మండిపడ్డారు. రిక్రూట్ మెంట్ కూడా లేకపోవడంతో ఆర్టీసి సిబ్బంది తీవ్ర వత్తిడికి గురవుతున్నారని చెప్పుకొచ్చారు. మృతుల కుటుంబాలకు ఈ సందర్భంగా నారా లోకేశ్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు మెరుగైన పరిహారం అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

Next Story