ఏపీలో భూ ఆక్రమణలపై సీరియస్ .. ఆ రోజు నుంచే యాక్షన్ స్టార్ట్

by srinivas |
ఏపీలో భూ ఆక్రమణలపై సీరియస్ .. ఆ రోజు నుంచే యాక్షన్ స్టార్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో భూ ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ అయింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, ఆక్రమణలను వెలికి తీసేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు గ్రామాలు, పట్టణాల్లో జరిగిన భూ ఆక్రమణల లిస్టును బయటకు తీసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో జరిగిన భూ ఆక్రమణలు, 22ఏ భూముల అక్రమాలతో పాటు రెవెన్యూ సమస్యలపైనా వినతులను స్వీకరించి పరిష్కరించనుంది. ప్రతి గ్రామంలో జరిగే రెవెన్యూ సదస్సులో ఎమ్మార్వోతో పాటు ఏడుగురు అధికారులు హాజరై వినతులను ఆన్ లైన్ చేసి విచారించ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే రీ సర్వే పేరుతో గత వైసీపీ సర్కార్ ఎక్కడికక్కడ సమస్యలను జఠిలం చేసినట్లు అధికారులు గుర్తించారు. వైసీపీ పెద్దలు భూ ఆక్రమణలకు పాల్పడటంతో పాటు 22ఏ భూములను అక్రమంగా దోపిడీ చేశారనే ఆరోపణలు ఉన్నట్లు అంచనాకు వచ్చారు. చాలా గ్రామాల్లో భూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో భూ సమస్యలన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ 15 నుంచి 30 వరకూ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయనుంది. ఈ సదస్సుల్లో అందిన ఫిర్యాదులపై సత్వరమే పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed