Amaravati:రాజధాని పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Jakkula.Mamatha |   (  Updated:2024-12-10 08:40:57  IST  )

రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్(AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Amaravati:రాజధాని  పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్(AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి(capital is Amaravati) పనుల పునరుద్ధరణకు ప్రభుత్వం(Government) ఆమోదం తెలిపింది. రాజధానిలో అసంపూర్తిగా ఉన్న మొత్తం 20 పనులకు సీఆర్డీఏ అథారిటీ సమావేశం(CRDA Authority Meeting)లో గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ.11,467 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన టెండర్లను ప్రభుత్వం పిలవనుంది.

ఈ మేరకు జీవో 968ను ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసు(All India Service) అధికారుల నివాస సముదాయాలు ఉన్నాయి. మొత్తం రూ. 11, 467 కోట్లలో రూ. 2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారుల పనులు చేపట్టగా.. రూ. 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కాల్వల అభివృద్ధి(Development of gravity channels), మూడు రిజర్వాయర్లు నిర్మిస్తారు. అలాగే రూ. 3,525 కోట్లతో అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు(Non Gazetted Officers), నాలుగో తరగతి ఉద్యోగుల నివాస భవన నిర్మాణాలను పూర్తి చేస్తారు.


Also Read...

Good News: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన!

Next Story