ఏపీలో వారికి బిగ్ షాక్.. నేరుగా వెళ్లి అనర్హుల ఏరివేత..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-10 10:36:32  IST  )

ఏపీలో బోగస్ లబ్ధిదారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది...

ఏపీలో వారికి బిగ్ షాక్.. నేరుగా వెళ్లి అనర్హుల ఏరివేత..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(AP)లో కూటమి ప్రభుత్వం పెన్షన్ల(Pensions) విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో పలువురు అర్హత లేకున్నా పెన్షన్లు, ఇళ్ల స్థలాలు(House Lands) పొందారని ఆరోపణలు వెళ్లువెత్తాయి. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు అందాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చర్యలకు దిగింది. బోగస్ పెన్షన్లు ఏరివేతపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సర్వే(Survey) మొదలు పెట్టింది. ఎన్ని బోగస్ పెన్షన్లు ఉన్నాయి, అర్హత లేకున్నా ఎంత మంది ఇళ్ల స్థలాలు తీసుకున్నారనే అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగం పరిశీలన చేస్తోంది. ఈ రోజు ఉదయం నుచే అనర్హులను గుర్తించే ప్రయత్నం చేస్తోంది. పెన్షన్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి నిర్విరామంగా సర్వే నిర్వహిస్తోంది. నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమాచారం సేకరిస్తోంది. పెన్షన్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి బోగస్‌ లబ్ధిదారుల(Bogus Beneficiaries)ను గుర్తిస్తోంది. అనర్హులను తొలగించి అర్హులకు న్యాయం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

కాగా కూటమి ప్రభుత్వంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. ఎన్నికల ప్రచారంలో పెన్షన్‌ను రూ.4 వేలు చేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు, వితంతువులకు రూ. 4 వేలు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీనే స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పింఛన్లు అందజేస్తున్నారు. 1వ తేదీ హాలిడే వస్తే అంతకుముందు రోజు ఉదయమే లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఏదో ఒక నియోజకవర్గంలో లబ్ధిదారులకు డబ్బులు ఇస్తున్నారు. అయితే చాలా నియోజకవర్గాల్లో అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నట్లు కూటమి ప్రభుత్వం దృష్టి వచ్చింది. దీంతో అనర్హులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా చర్యలకు చేపట్టింది.

Next Story