AP News:‘ప్రభుత్వ తీరు బాధాకరం’..వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula.Mamatha |   (  Updated:2024-08-23 07:55:00  IST  )

అచ్యుతాపురం ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమని జగన్ అభిప్రాయపడ్డారు.

AP News:‘ప్రభుత్వ తీరు బాధాకరం’..వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్:అచ్యుతాపురం ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమని జగన్ అభిప్రాయపడ్డారు. నేడు (శుక్రవారం) వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రమాద బాధితులను పరామర్శించారు. ఈ ఘటన పై వైఎస్ జగన్ మాట్లాడుతూ..ప్రభుత్వం వేగంగా స్పందించలేదని ఆరోపించారు. మంత్రులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లలేదని ఫైరయ్యారు. అంబులెన్స్‌లు సమయానికి రాలేదు. బాధితులను కంపెనీ బస్సుల్లో ఆసుపత్రికి తీసుకొచ్చారు. కార్మిక శాఖ మంత్రి ఏమి తెలియనట్టు మాట్లాడారని వాపోయారు.

నేను సీఎంగా ఉండగా ఎల్‌జీ పాలిమర్స్ ఘటన జరిగితే గంటల్లో వెళ్లా అని వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన బాధితులకు ఇంకా పరిహారం అందలేదని వైఎస్ జగన్ ఆరోపించారు. వారంలోగా బాధితులకు పరిహారం అందించాలని ఆయన డెడ్ లైన్ విధించారు. వారంలో పరిహారం ఇవ్వకుంటే బాధితుల తరఫున వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం. అవసరమైతే నేను కూడా ధర్నాలో పాల్గొంటా అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

Next Story